Telangana

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పటాన్‌చెరు మండల ఇన్‌చార్జి, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని పటాన్‌చెరు మండల ఇన్‌చార్జి, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్   జయంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపల్ లోని తన కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు . అనంతరం గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ధైర్యసాహసాలకు, సామాజిక సమానత్వానికి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. సామాన్య ప్రజలపై జరుగుతున్న దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన గొప్ప వీరుడు పాపన్న గౌడ్ అని అన్నారు.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, గౌరవం దక్కాలనే ఆశయంతో సర్వాయి పాపన్న గౌడ్ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ధైర్యం, పట్టుదల, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలు, పోరాటాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కృష్ణ గౌడ్,దీపక్ గౌడ్,షకీల్,వినయ్ గౌడ్,సల్మాన్,షర్పుద్దీన్,వినీత్ రెడ్డి,ఆర్బాజ్,సాయి కుమార్ పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago