– కోట్లాది రూపాయలతో అభివృద్ధి పథంలో గచ్చిబౌలి డివిజన్ – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
గచ్చిబౌలి డివిజన్ ను కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. కార్పోరేటర్ గా గెలిచి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం రోజు గౌలిదొడ్డిలోని కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం 23 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, ఈ సంవత్సరం లో ఇప్పటివరకు 35 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.తాను గెలిచినప్పటి నుండి గచ్చిబౌలి డివిజన్ లో సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, చెరువుల సుందరీ కరణ పనులు, అంతర్గత రోడ్లు, పార్కుల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.రాయదుర్గం నానక్ రామ్ గూడ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి, గోపన్ పల్లి తాండా, ఎన్ టి ఆర్ నగర్, తాజ్ నగర్, సాయి ఐశ్వర్య, సాయి వైభవ్, నల్లగండ్ల, టెలికం నగర్, మధురానాగర్, ప్రశాంత్ హిల్స్, నల్లగండ్ల హుడా కాలని ఇలా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇంకా కొన్ని పనులు చేపట్టాల్సి ఉందని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చేపట్టలేకపోతున్నామని, త్వరలోనే వాటికి కూడా ప్రణాళికలు రూపొందించి నిధులు విడుదల చేయించి అభివృద్ధి పనులు మొత్తం పూర్తి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజలు ఏ సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చినా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
ప్రజలు ఏ నమ్మకంతో నైతే తనను గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని గచ్చిబౌలి డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్,రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు విట్టల్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్,తిరుపతి దయాకర్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, ,గచ్చిబౌలి డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షురాలు ఇందిరా, గచ్చిబౌలి డివిజన్ కార్యదర్శి సుజాత,గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షులు శ్రీరాములు, సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్,సంజీవ్,సుబ్రమణ్యం,అరుణ్ గౌడ్, రంగస్వామి ముదిరాజ్, ముర్గ,విష్ణు,నగేష్ దుర్గరామ్,టీంకు,వెంకటేష్,సురేష్,సాయి,శ్రీను, స్థానిక నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.