politics

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం

మీ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా

రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర సమావేశంలో పటాన్చెరు శాసనసభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పల్లె నుండి పట్నం వరకు నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని పటాన్చెరు శాసన సభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్ర కలిగిన రేషన్ డీలర్ల సంఘానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా తనను ఎన్నుకోవడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. ప్రకృతి విపత్తుల సంభవించిన, కరోనా లాంటి మహమ్మారి మూలంగా లక్షలాదిమంది చనిపోయిన సమయంలోనూ ప్రాణాలకు తెగించి ప్రజలకు నిత్యవసర వస్తువులు అందించడంలో రేషన్ డీలర్ల పాత్ర శ్లాగనీయమన్నారు. దశాబ్ద కాలంగా రేషన్ డీలర్లు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు ఇచ్చిన ప్రధాన హామీల అమలుకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా  ఐదు వేల రూపాయల గౌరవ వేతనం, క్వింటాలకు 300 రూపాయల కమిషన్ అందించాలను కోరుతూ త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీలర్ల సంఘం అధ్యక్షులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని తెలిపారు. హామీల అమలు అనంతరం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రెండు లక్షల మందితో విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు మాట్లాడుతూ రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు, ప్రతి రేషన్ డీలర్ కు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, ఎంఎల్ఎస్ పాయింటలో ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జిలు, కరణం సమయంలో మరణించిన రేషన్ డీలర్ల కుటుంబ సభ్యులకు తిరిగి రేషన్ దుకాణాలు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు కృష్ణమూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వంభర్, వివిధ జిల్లాల నుండి సుమారు పదివేల మంది రేషన్ డీలర్లు హాజరయ్యారు.

admin

Recent Posts

ప్రతిభా ప్రదర్శన వేదికగా ‘సాధన-2026’

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…

24 hours ago

పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు ఘన వీడ్కోలు

శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :…

2 days ago

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

5 days ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

5 days ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

6 days ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

6 days ago