ఒకే రోజు 28 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవాలు.

politics Telangana

_నూతన రహదారులతో శరవేగంగా గ్రామాల అభివృద్ధి

_నందిగామలో మూడు కోట్ల రూపాయలతో నూతన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం

_మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులు విస్తరిస్తున్నామని, దీని మూలంగా అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మంగళవారం పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ, పాశమైలారం, బచ్చు గూడెం, పెద్దకంజర్ల గ్రామాలలో పర్యటించి 28 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు.ప్రధానంగా నందిగామ గ్రామంలో గ్రామ ప్రజల కోసం మూడు కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన నూతన ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు.అనంతరం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఓఆర్ఆర్ జంక్షన్ నుండి పెద్ద కంజర్ల మీదుగా శివానగర్ వరకు 22 కోట్ల రూపాయల హెచ్ఎం డి ఏ నిధులతో చేపట్టనున్న రహదారి విస్తరణ పనులకు పెద్ద కంజర్ల చౌరస్తాలో శంకుస్థాపన చేశారు.బతుకమ్మ పండుగ పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిఏటా మహిళల కోసం అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తోలి రోజు నందిగామ పాశమైలారం, బచ్చుగూడెంలలో గ్రామాలలో ప్రారంభించి చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రహదారుల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత అందిస్తూ, ప్రాధాన్యత క్రమంలో నిధులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఓఆర్ఆర్ జంక్షన్ నుండి ఇంద్రేశం, పెద్ద కంజర్ల మీదుగా శివనగర్ వరకు 22 కోట్ల రూపాయలతో చేపడుతున్న రహదారి విస్తరణ పనులు పూర్తయితే ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ తో పాటు వివిధ రంగాలు వేగంగా అభివృద్ధి చెందింది ఎందుకు అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.

దీంతోపాటు పెద్దకంచెర్ల నుండి బేగంపేట్ వరకు 11 కోట్ల రూపాయలు కేటాయించి అతి త్వరలో రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.నిరుపేద, మధ్యతరగతి ప్రజలు తమ వివాహాది శుభకార్యాలు అతి తక్కువ ఖర్చుతో చేసుకునేందుకు వీలుగా నందిగామ గ్రామంలో మూడు కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులు కేటాయించి అత్యంత ఆధునిక వసతులతో కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గ్రామ పంచాయితీలకు శాశ్వత ప్రాతిపాదికన ఆధునిక వసతులతో విశాలమైన ప్రాంగణాల్లో గ్రామపంచాయతీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు.

బతుకమ్మ చీరల పంపిణీ..

రాష్ట్రంలోని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రీతిపాత్రంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి మహిళ ఆనందంగా పండుగ నిర్వహించుకోవాలన్న సమన్నత లక్షలతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోని అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఎంపీడీవో బన్సీలాల్, సిఐ లాలు నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు ఉమావతి గోపాల్, కృష్ణ, సుమతి రామచందర్, నరసింహ, రాజ్ కుమార్, నారాయణరెడ్డి, ఎంపీటీసీలు నాగజ్యోతి లక్ష్మణ్, మమత బిక్షపతి, వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, దశరథ్ రెడ్డి, బిక్షపతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *