బీరప్ప ఆలయ నిర్మాణానికి విరాళం…
– మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు
పటాన్ చెరు:
పటాన్ చెరు మండలంలోని కర్దనూర్ గ్రామంలో నిర్మిస్తున్న బీరప్ప ఆలయ నిర్మాణానికి తనవంతు సాయంగా మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు విరాళం అందించారు.
ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి గుడికి సంబంధించిన బండలు మరియు గ్రానైట్ వేయించడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి , ఉపసర్పంచ్ కుమార్ , శివయ్య యాదవ్, భూపాల్ యాదవ్, యాదయ్య యాదవ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
