కొడకంచి మాజీ ఉప సర్పంచ్   పాతూరి మల్లేష్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిక

Districts Hyderabad politics Telangana

సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని కొడకంచి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ప్రస్తుత వార్డు సభ్యులు పాతూరి మల్లేష్ గాంధీభవన్ మాజీఉపముఖ్యమంత్రి రాజనర్సింహ పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ప్రజాప్రతినిధులు ఉన్నారని.

కనీసం గ్రామపంచాయతీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ప్రభుత్వం ఈ ప్రజలు అయితే తెలంగాణ వచ్చాక అభివృద్ధి ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి అనుకొని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం బాధాకరమని తెలిపారు అందుకనే ప్రజల సమస్యలు తీరాలంటే ప్రజల శ్రేయస్సు కోరే ఏకైక కాంగ్రెస్ పార్టీ సరైందని పార్టీలో చేరడం జరిగిందని కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ప్రజలు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి ప్రజల శ్రేయస్సు కోరే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరుకున్నారుఈ కార్యక్రమంలో జిన్నారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి వైస్ ఎంపీపీ గంగు రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపిటిసి వడ్డే కృష్ణ వార్డు సభ్యులు గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *