అవుటర్ రింగ్ రోడ్డు పై ఎల్ఈడి విద్యుద్దీపాల ప్రారంభం
మన వార్తలు ,పటాన్ చెరు:
నాడు కాలుష్యానికి కేంద్రం గా నిలిచిన పటాన్చెరు నియోజకవర్గం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందనీ, నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నీ కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు పైన 100 కోట్ల రూపాయలతో 190 కిలోమీటర్ల మేర ఏర్పాటుచేసిన ఎల్ఈడి వీధిదీపాలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం పటాన్చెరు మండలం ముత్తంగి అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివిధ జిల్లాల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలు, ప్రజాప్రతినిధుల సంపూర్ణ సహకారం తో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నియోజకవర్గ అభివృద్ధికి వెన్నంటి నిలుస్తున్నారని తెలిపారు. నూతనంగా ఏర్పాటు అవుతున్న రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.