మన వార్తలు
కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖకు చెందిన అధికారులతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో మంత్రులు నిరంజన్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవ రావు గారు, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు గారు, పలువురు ఎంపీలు, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు . ధాన్యం సేకరణ వ్యవహారంపై కేంద్ర అధికారులతో వారు చర్చించారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని ఇటీవల కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ అధికారులతో మంగళవారం నాడు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి స్పష్టత కోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు సమావేశం అయ్యారు.