మనవార్తలు ,మియాపూర్:
ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే స్ఫూర్తితో ప్రస్తుత దోపిడీ వ్యవస్థ పై పోరాడాలని MCPI(U) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్ పిలుపునిచ్చారు.136వ మేడే సందర్భంగా మియాపూర్ డివిజన్ స్టాలిన్ నగర్ లో ఏర్పాటు చేసిన ఎర్ర జెండాను ఎగరేసి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దోపిడీ వ్యవస్థ కొనసాగుతోందని ఈ దోపిడీకి వ్యతిరేకంగా పెట్టుబడిదారి ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా మేడే కార్మికుల పోరాట స్ఫూర్తితో దోపిడీ వ్యవస్థను ఎదుర్కోవాలని అన్నారు. నాడు ఎన్ని గంటల పని విధానం గురించి వందలాది మంది ప్రాణాలు త్యాగాలు చేస్తే నేడు మళ్లీ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉధృతమై 12 గంటల పనివిధానాన్ని తీసుకువచ్చిందని అన్నారు.
పెట్టుబడిదారులు కార్మిక హక్కులను కాలరాస్తూ భారత పాలక వర్గాలను తమ గుప్పెట్లో ఉంచుకుని అని ఆరోపించారు. పెట్టుబడిదారి పాలకవర్గాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ముజాఫ్ఫార్ అహ్మద్ నగర్ లో కామ్రేడ్ తాండ్ర కళావతి,తుడుం అనిల్ కుమార్, టేకు నరసింహ నగర్ లో శంకర్, నడిగడ్డ తాండ లో కామ్రేడ్ కుంభం సుకన్య, ఓంకార్ నగర్ లో పల్లె మురళి, మియాపూర్ బస్ స్టాండ్ కన్నశ్రీనివాస్, మక్త మహబూబ్ పేటలో మైధం శెట్టి రమేష్, పోగుల ఆగయ్య నగర్ లో కర్ర దానయ్యలు జెండాలు ఎగరవేశారు.
ఈ కార్యక్రమంలో వనం సుధాకర్, ఏ.పుష్ప,బి.రవి, జీ.లావణ్య,దార లక్ష్మి,సుల్తానా,శివాని, గణేష్ ,నాగభూషణం,నర్సింగ్, వెంకటాచారి, రతన్ నాయక్, లలిత, ఇస్సాక్, రాంబాబు, అమీనా,రజియా తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.