పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
ఫెనైస్సీ ( ఇంటెలెక్ట్ అండ్ స్కిల్ ) – ఫైనాన్స్ క్లబ్’ను గీతం బిజినెస్ స్కూల్ ( జీఎస్బీ ) హైదరాబాద్ సోమవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా , జీఎస్బీలోని ఫైనాన్స్ విభాగం పనితీరు , సాధించిన విజయాలు , ప్రాంగణ నియామకాలను ఆ విభాగాధిపతి డాక్టర్ రాధిక వివరించారు . క్లబ్ అధ్యక్షుడు ప్రద్యుమ్న , సహ – అధ్యక్షురాలు అఖిల అనిసెట్టి , క్రియాశీల సభ్యురాలు అనిషా శ్రీనివాసన్లు క్లబ్ ఎజెండా , దాని భవిష్యత్తు ప్రణాళికల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు . క్లబ్ తొలి న్యూస్ లెటర్ను జీఎస్బీ ప్రిన్సిపాల్ డాక్టర్ జయశ్రీకి అందజేశారు . ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి . తొలుత , గీతం ప్రాంగణంలో పచ్చదనాన్ని పెంపొందించి , దానిని వ్యాప్తి చేయడంలో భాగంగా , జీఎస్బీ విద్యార్థులు మొక్కలు నాటారు . ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . అనంతరం ఫ్లాష్ మాబ్ నిర్వహించారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…