విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి కోసం చదువుతో పాటు క్రీడా పోటీలు
విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్‌పర్సన్ రాణి రుద్రమ దేవి
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
విద్యార్థలు పట్టుదలతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ పేర్కొన్నారు.పటాన్‌చెరు మండలం చిన్న కంజర్ల గ్రామం లోని విజ్ఞాన్ విద్యాలయంలో శనివారం వార్షిక క్రీడా దినోత్సవం (samanvaya 2026) వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడలను కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని చెప్పారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే పట్టుదల, శ్రమ, క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమని విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు.విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్ పర్సన్ రాణి రుద్రమ దేవి మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి కోసం తమ పాఠశాలలో చదువుతో పాటు అన్ని రకాల క్రీడా పోటీలు, సైన్స్ ప్రాజెక్టులు, సాంస్కృతిక ,వ్యవస్థాపకత. కార్యక్రమాలు ,సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. విజ్ఞాన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మవల్లి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో జట్టు భావన, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆలరించాయి.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.క్రీడా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ముఖ్య అతిథి బహుమతులు అందజేశారు.మొత్తం కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…