మనవార్తలు,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ భౌతిక , మిశ్రమ పదార్థాల ఆధునిక పోకడల’పై మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ( ఎస్ఓడీపీ ) ని మార్చి 23-25 తేదీలలో నిర్వహించనున్నట్టు ఆ విభాగాధిపతి డాక్టర్ సి.శ్రీనివాస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . పదార్థ శాస్త్రం , సాంకేతికత అనేది భౌతిక లక్షణాలు , సూక్ష్మ నిర్మాణాలపై దృష్టిసారించే అంతర్ విభాగ అంశమన్నారు . పారిశ్రామిక , సామాజిక – ఆర్థిక వృద్ధికి అవసరమైన సాంకేతిక ప్రక్రియల కోసం వినూత్న పదార్థాల రూపకల్పన , అభివృద్ధితో పాటు పురోగతికి దారితీసినట్టు తెలిపారు . అదే సమయంలో కొన్ని కొత్త సమస్యలు కూడా వెలుగులోకి వచ్చాయన్నారు . నానోమెటీరియల్స్ , నానాటెక్నాలజీ , స్మార్ట్ మెటీరియల్స్ , ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్ల కోసం హైఎంట్రోపీ మెటీరియల్స్ వంటి అంశాలపై ఈ మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమంలో విరివిగా చర్చిస్తారని తెలిపారు .
విద్యా సంస్థలు , పరిశ్రమ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులతో కీలక ఉపన్యాసాలు , మరో ముగ్గురు నిపుణులతో చర్చలు , రెండు ప్రయోగాత్మక శిక్షణ కార్యక్రమాలు , పరిశ్రమ నిపుణులతో ప్యానెల్ చర్చ వంటివి ఉంటాయన్నారు . పేర్ల నమోదు , వసతి తదితర వివరాల కోసం https://forms.gle/Gb3hnlJbkaUQspPG9 లాగిన్ అవ్వాలని , డాక్టర్ వి.జీవన్ , సమన్వయకర్త ( 77948 35203 ) ని సంప్రదించాలని లేదా jvemula@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని ఆయన సూచించారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…