మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ , హెదరాబాద్ ఆధ్వర్యంలో ‘ కేస్ డిస్కషన్ మెథడాలజీ ‘ అనే అంశంపై ఐదురోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని ఈనెల 20-24 తేదీలలో నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . కేస్ డిస్కషన్ మెథడాలజీ అనేది సమస్య పరిష్కారంలో శిక్షణ కోసం అవసరమైన అనుభవపూర్వక అభ్యాస పద్ధతని , సమర్థమైన నిర్వహణకు , సందర్భోచిత విశ్లేషణ , అంతర్దృష్టుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు . విద్యార్థుల మేథస్సును ఉత్తేజపరిచేందుకు , మేథో సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేస్ మెథడ్ లెర్నింగ్ను ఉపయోగించడం ఆచరణాత్మమైనదన్నారు . కేస్ డిస్కషన్లు ఉపన్యాసాలు , సెమినార్లు , గేమ్లు , రోల్ ప్లేలు , ఇండస్ట్రియల్ సందర్శనలు , సమూహ వ్యాయామాలతో సమస్య – పరిష్కారం , నిర్ణయం తీసుకోవడం , అనులు చేసే నెపుణ్యాలను అభివృద్ధి చేయగలవని డెరైక్టర్ వివరించారు .
క్లాస్టూమ్ సెట్టింగ్ కేస్ డిస్కషన్లను హ్యాండిల్ చేయడంపై సదస్యులకు స్వీయ అనుభవాన్ని అందించడం , విభిన్న రంగాలకు చెందిన అధ్యాపకులు వారి రంగంలోని నైపుణ్యం ఉన్న ప్రాంతంలో కేసులను హ్యాండిల్ చేసేలా తర్ఫీదు ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా ప్రొఫెసర్ కరుణాకరన్ అభివర్ణించారు . బోధనలో అనుభవపూర్వక అభ్యాస పద్ధతులను అభినందించడం , కేస్ డిస్కషన్ మెథడాలజీ ప్రక్రియతో అధ్యాపకులకు పరిచయం చేయడం , తరగతి గదిలో కేసులను నిర్వహించడంలో ప్రయోగాత్మక అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈ అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు .
దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలలోని అధ్యాపకుల కోసం ఈ ఎఫీడీపీని ఉద్దేశించామని , ఆసక్తి ఉన్నవారు ఇతరత్రా వివరాల కోసం కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ దివ్య కీర్తి గుప్తా dgupta@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని ఆయన సూచించారు .