గీతం బీ-స్కూల్లో డేటా అనలిటిక్స్ పై ఎఫ్ ఢీపీ…

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్ మే 1 నుంచి 10వ తేదీ వరకు ‘ఆర్, పట్టికని ఉపయోగించి అధునాతన పరిశోధన కోసం సమాచార విశ్లేషణ’ అనే అంశంపై పది రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్ఐటీ వరంగల్లోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ, మేనేజ్మెంట్ స్కూల్ సంయుక్త సౌజన్యంతో దీనిని నిర్వహిస్తున్నట్టు సమన్వయకర్త డాక్టర్ మెరుగు వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.డేటా ప్రాముఖ్యత, సమాచార విశ్లేషణ పరిచయం, గణాంక పద్ధతులు అవలోకనం, జన్యు అల్గారిథమ్ లు, వ్యాపార పరిశోధనలో మల్టీవియారిట్ టెక్నిక్ల పరిచయం మొదలైనవి ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో వక్తలుగా ఎస్ఐటీ వరంగల్ మేనేజిమెంట్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్ ఎం.రవీందర్రెడ్డి, డాక్టర్ పీఆర్సీ గోపాల్; ఎన్ఐటీ సూరత్కల్కు చెందిన డాక్టర్ రితాంజలి మారీ, ఎస్ఐటీ కాలికట్కు చెందిన డాక్టర్ నిత్య, జర్మనీలోని పోస్ట్ డాక్టర్ ఫెలో డాక్టర్ సమీరన్ దాస్లతో పాటు ముగ్గురు గీతం బీ-స్కూల్ అధ్యాపకులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
ఎంబీఏ, ఇంజనీరింగ్, ఎంసీఏ, ఇతర అనుబంధ విభాగాల అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని, అలాగే అనుబంధ రంగాల పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది కూడా హాజరు కావచ్చని డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ముందుగా వచ్చిన వారికి, ఇందులో పాల్గొనడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, గరిష్ఠంగా వంద మంది వరకు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికెన వారి జాబితా ఈ-మెయిల్ దారా తెలియజేస్తామన్నారు.పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం 9959 260 114 లేదా vmerugu@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సమన్వయకర్త సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *