Districts

ప్రయోగాత్మక విద్య – ప్రగతికి బాట..

– గీతం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు డెరైక్టర్ నీకే మిట్టల్ ఉద్బోధ

మనవార్తలు ,పటాన్ చెరు:

ఏదైనా ఒక అంశాన్ని ప్రయోగాత్మకంగా , అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అది పది కాలాలపాటు జ్ఞాపకం ఉండడమే గాక , విద్యార్థుల ప్రగతికి బాటలు వేస్తుందని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ నీకే మిట్టల్ అన్నారు . మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ ద్విచక్ర వాహనంలో లోపాలను కనుగొనడం , ఇంధన సామర్థ్యం ‘ అనే అంశంపై గురువారం నిర్వహించిన ఒక రోజు కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఇంజనీరింగ్ ఔత్సాహికుల కోసం ప్రయోగాత్మకంగా నిర్వహించే కార్యశాలలకు తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు . ప్రతి అభ్యాసాన్నీ ఎందుకు , ఎలా అనే విచారణాత్మక వైఖరితో ఆరంభించాలని , ప్రతి నైపుణ్య అనుభవాన్ని జ్ఞాపకం , అవగాహన , అన్వయంతో పొందాలని మిట్టల్ సూచించారు . బీటెక్ రెండు , మూడు , నాలుగో ఏడాది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యశాలలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లు , ఆయా విడిభాగాలను జోడించడం , విడదీయడం , సొంత వాహనాలలో ఏవైనా లోపాలున్నాయా , ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు దానిని అధిగమించే విధానాలను ( సొంతంగా రిపేర్ చేసుకోవడం ) సీనియర్ విద్యార్థులు వివరించారు .

ఎంతో ఉత్సుకతతో సాగిన ఈ కార్యశాలలో వాస్తవిక అనుభవాన్ని విద్యార్థులు పొందడంతో పాటు ఆయా అంశాలపై ప్రాథమిక అవగాహనను ఏర్పరచుకున్నారు . తొలుత , మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ స్వాగత ప్రసంగంతో ఆరంభమైన ఈ కార్యశాలలో ప్రొఫెసర్ పి . ఈశ్వరయ్య , కార్యక్రమ సమన్వయకర్తలు పి.అనీలక్కుమార్రెడ్డి , జె.రమేష్ , ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు . ఇందులో పాల్గొన్న విద్యార్థులందరికీ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేయడంతో ఈ ఒకరోజు వర్క్షాప్ ముగిసింది . ‘ కేఫ్ కనెక్షన్స్ ‘ ప్రారంభం ఆహారం యువతను ఉత్తేజపరిచేలా పనిచేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే .

విద్యార్థుల సృజనాత్మక మనస్సులను ఉత్తేజపరిచి , వారిని ప్రేరేపించడానికి గాను గీతం హెదరాబాద్ ప్రాంగణంలో గురువారం ‘ కేఫ్ కనెక్షన్స్ ‘ పేరిట ఆధునిక ఫలహారశాలను అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ . శివప్రసాద్ ప్రారంభించారు . ఇది విద్యార్థులకు పరిశుభ్రమైన , ఆరోగ్యకరమైన ఆహారం , స్నాక్స్ , ఐస్క్రీమ్లు , శీతల పానీయాలను అందిస్తుంది . విద్యార్థులు కొద్దిసేపు సేదతీరి , వారి క్షుద్బాధను తీర్చుకోవడానికే గాక , అనధికారికంగా నేర్చుకునే సమర్థవంతమైన ప్రదేశం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు . ఈ కార్యక్రమంలో రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ కూడా పాల్గొన్నారు .

admin

Recent Posts

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని…

21 hours ago

నిండు జీవితానికి రెండు చుక్కలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం…

23 hours ago

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

2 weeks ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago