Telangana

ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలి

అమీన్పూర్‌లో విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం

మనవార్తలు ప్రతినిధి,అమీన్పూర్ :

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అమీన్పూర్‌ డివిజన్ పరిధిలోని మాధవపురి హిల్స్, పిజెఆర్ ఎంక్లేవ్ కాలనీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం విగ్రహ ప్రతిష్టాపన, చక్రపురి కాలనీలో శ్రీశ్రీశ్రీ ముద్గల ఈశ్వర ఆలయంలో శివలింగం ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, ప్రశాంతత, సత్సంకల్పాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నియోజకవర్గం వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, గోపాల్, కృష్ణ, మహాదేవ రెడ్డి, బిజిలి రాజు, రాములు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago