యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రామేశ్వరంబండ వీకర్ సెక్షన్ కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలం రామేశ్వరంబండ గ్రామ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో గ్రామ మాజీ సర్పంచ్ అంతిరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారుఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి గొప్ప నాయకుడు డాక్టర్ అంబేద్కర్ అని తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు, సమాన హక్కులు, పరిపాలన వికేంద్రీకరణ, చిన్న రాష్ట్రాలు, పరిపాలనలో మహిళలకు 50% రిజర్వేషన్లు, తదితర మహోన్నత నిర్ణయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆయన స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంతో.. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గ్రామ మాజీ సర్పంచ్ ధరణి అంతి రెడ్డి, సీనియర్ నాయకులు బండి శంకర్, వెంకట్ రెడ్డి, ఆంజనేయులు, నగేష్, శంకర్, సురేష్, ఇబ్రహీం, అర్జున్, కిరణ్, రమేష్, దానయ్య, నవీన్, సర్దార్, సాయిలు, రాములు, లోకేష్, దశరథ్, యాదమ్మ, నగేష్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…