నందిగామ హరితహారంలో మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం తోపాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని శాసనమండలి ప్రోటేమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామం లో హరితహారం కార్యక్రమానికి చైర్మన్ భూపాల్ రెడ్డి తోపాటు,మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్ భూపాల్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరిత హారం కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయిఅని తెలిపారు. రోజు రోజుకి కుచించుకుపోతున్న అటవీ ప్రాంతాన్ని పెంపొందించాలంటేవిధిగా మొక్కలు నాటవలసిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. నందిగామ గ్రామంలో హరితహారం కార్యక్రమం ద్వారా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడంపట్ల స్థానిక ప్రజా ప్రతినిధులను ఆయన అభినందించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు కాలుష్యానికి చిరునామా గాపేరొందిన పటాన్చెరు ప్రాంతం నేడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూప్రతి గ్రామం, పట్టణం పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేస్తూ ప్రతి ఇంటికి ఆరు ముక్కల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాన్ని 100% సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.