ఈటల ఎమ్మెల్యే పదవికి నేడే రాజీనామా….

Hyderabad

ఈటల ఎమ్మెల్యే పదవికి నేడే రాజీనామా….
-14 న బీజేపీలోకి
-10 .30 గంటలకు అనుచరులతో గన్ పాక్ వద్ద అమరులకు నివాళి
-తరువాత అసెంబ్లీ సెక్రటరీ కి రాజీనామా సమర్పణ

హైదరాబాద్:

మాజీమంత్రి ఈటల రాజేందర్ నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. భూకబ్జా ఆరోపణలతో కేసీఆర్ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ కు గురైన ఈటల కొన్ని రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందు ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా తోపాటు ఇతర ముఖ్యనేతలను కలిశారు. బీజేపీ నుంచి సరైన హామిపొందిన తరువాతనే ఆ పార్టీలో చేరేందుకు మొగ్గుచూపారని తెలుస్తుంది.

ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆరోజే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ చేయలేదు… అనంతరం ఆయన నియోజవర్గమైన హుజురాబాద్ లో పర్యటించారు. తాను పార్టీ పెట్టలేదు … పార్టీలో చేరలేదని మాటలు తో ఆయన స్వరంలో మార్పు వచ్చిందని పరిశీలకులు భావించారు.మొత్తానికి బీజేపీ లో చేరడం ఆయనకు అంతగా ఇష్టం లేనప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నందున తనకు రక్షణ ఉంటుందని భావించారని సమాచారం.

బీజేపీ లో చేరేందుకు ముహూర్తం ఖరారు కావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని రాజీనామా లేఖ అందజేసేందుకు అసెంబ్లీ కార్యాలయానికి వస్తున్నట్లు సమాచారం పంపగా కరోనా బాగా వ్యాపిస్తుండటంతో కార్యాలయానికి రాలేక పోతున్నానని తెలిపారు.రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేయమని చెప్పినట్లు తెలుస్తుంది.రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందించడంతో పాటు టీఆర్ యస్ కార్యాలయానికి కూడా మెస్సెంజర్ లేదా ఇమెయిల్ ద్వారా పంపాలని ఈటల నిర్ణయించుకుంట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *