Telangana

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు సమ న్యాయం: నీలం మధు ముదిరాజ్

మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత..

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్

శ్వేతను శాలువాతో సత్కరించి, అభినందించిన కాంగ్రెస్ నేత నీలం మధు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా అన్ని వర్గాలకూ సమ న్యాయం చేస్తోందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి బహుజన ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ వారసత్వాన్ని గౌరవిస్తూ  ఆమె మనవరాలు చిట్యాల శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో, నూతనంగా నియమితులైన మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత బుధవారం చిట్కుల్ లోని ఆయన కార్యాలయంలో నీలం మధు ముదిరాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, మిఠాయి తినిపించి నీలం మధు ఘనంగా సత్కరించి అభినందించారు,

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, సాయుధ పోరాట యోధులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కొనియాడారు.గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేడు చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. ఇది బహుజన వర్గాలకు, ముఖ్యంగా రజక సామాజిక వర్గానికి దక్కిన గౌరవంగా అభిప్రాయపడ్డారు.

అనంతరం చిట్యాల శ్వేత మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చిట్యాల శ్వేత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనను అభినందించిన నీలం మధు ముదిరాజ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ చాకలి ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా గతంలో చిట్కుల్ లో ఏర్పాటు చేసిన ఐలమ్మ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు, రాష్ట్రంలో మహిళల భద్రత, హక్కుల పరిరక్షణకు వారి సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు..

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago