Telangana

గీతంలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ

వృత్తి వికాస కార్యక్రమంలో శిక్షకులుగా ఐఐటీ, ఐఐఎస్సీ, బార్క్ నిపుణులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

సహజంగా భౌతికశాస్త్రం అంటే విద్యార్థులకు కొంచెం సంకోచం ఉంటుంది. ఆ భావనను పూర్తిగా మార్చివేసి, విద్యార్థుల మక్కువను చూరగొనే పాఠ్యాంశంగా దానిని మలచాలని హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం సంకల్పించింది. దానికోసం, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని, భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు మూడు రోజుల రెసిడెన్షియల్ వృత్తి వికాస కార్యక్రమాన్ని (ఆర్పీడీపీ) జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇండియన్ ఫిజిక్స్ అసోసియేట్ (ఐపీఏ) సహకారంతో, గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు.భావనాత్మక అవగాహనను ప్రయోగాత్మక అభ్యాసం, సమకాలీన బోధనా పద్ధతులతో అనుసంధానించడం ద్వారా పాఠశాల, యూజీ స్థాయిలో భౌతికశాస్త్ర విద్యను బలోపేతం చేయడానికి దీనిని రూపొందించారు. తరగతి గదులలో శాస్త్రీయ జిజ్జాస, చురుకైన అభ్యాసం, భావనా స్పష్టత, ప్రత్యక్ష ప్రయోగాలను ప్రోత్సహించే వినూత్న బోధనా పద్ధతుల కోసం పెరుగుతున్న అవసరాన్ని తీర్చడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

ప్రముఖ సంస్థల నుంచి విశిష్ట విద్యావేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులను ఒకచోట చేర్చి, ఇందులో పాల్గొనే వారికి భౌతికశాస్త్రంలోని అధునాతన భావనలు, ఆధునిక విద్యా సాధనాలు, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగాత్మక పద్ధతులు, అనుకరణలు, ఐసీటీ ఆధారిత బోధన, విద్యార్థి మూల్యాంకన వ్యూహాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారు. గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు చెందిన అధ్యాపక బృందం బోధనా పద్ధతులు, అభ్యాసన సిద్ధాంతాలపై ప్రత్యేక సెషన్లను కూడా నిర్వహించి, ఈ కార్యక్రమాన్ని లక్ష్యాన్ని మరింత సుసంపన్నం చేయనుంది.ఈ మూడు రోజుల కార్యక్రమంలో విద్యుదయస్కాంత సిద్ధాంతం, ఫోటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్, సూపర్ కండక్టివిటీ, అయస్కాంతత్వం, అణు వికిరణం, ప్రయోగాత్మక ప్రదర్శనలు, స్వయంగా తయారు చేసుకునే భౌతిక శాస్త్ర కిట్లు, తరగతి గది బోధనా పద్ధతులు, అభ్యసన మూల్యాంకన పద్ధతులు వంటి అంశాలు ఉంటాయి.

ఈ శిక్షణా కార్యక్రమంలో గీతం సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ ఎస్.అనంత రామకృష్ణ; విశిష్ట విజిటింగ్ ఆచార్యుడు ప్రొఫెసర్ బి.వి.ఆర్. టాటా; ఐఐటీ మద్రాసు ఆచార్యుడు ప్రొఫెసర్ టి.ఎస్. నటరాజన్; బెంగళూరులోని ఐఐఎస్ సీకి చెందిన ప్రొఫెసర్ విబోర్ సింగ్ వంటి నిపుణులు పాల్గొంటారు. అలాగే గీతం విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ జి.రవి కుమార్; బాబా అణు శక్తి సంస్థ పూర్వ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జి.ఎ. రామారావు; మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రొఫెసర్ వనజ, ముంబైలోని టాటా ప్రాథమిక పరిశోధనా సంస్థ, హోమీ భాభా విద్యా సంస్థకు చెందిన ప్రొఫెసర్ దీపాచారి తదితరులు పాల్గొని, సదస్యులకు తగిన మార్గదర్శనం చేయనున్నారు.ఈ కార్యక్రమం పాఠశాల స్థాయి భౌతిక శాస్త్రం, విజ్జాన శాస్త్ర ఉపాధ్యాయుల కోసం ఉద్దేశించారు. భౌతికశాస్త్ర విద్యలో ఉత్తమ పద్ధతులు, వినూత్న విధానాలను పంచుకోవడానికి ఒక సహకార వేదికను సృష్టించడం దీని లక్ష్యం.

ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జి.సాయిప్రీతి, డాక్టర్ టి.విశ్వం సమన్వయం చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు తమ పేర్ల నమోదు, ఇతరత్రా వివరాల కోసం కార్యక్రమ సమ్వనకర్తలు షామాబీ (77802 74121) లేదా గోపీకృష్ణ (87120 18815) లను సంప్రదించవచ్చు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago