పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రముఖ కళాకారిణి డాక్టర్ నీనా ప్రసాద్ మోహినియాట్టం నృత్య ప్రదర్శన ఆసొంతం మనోహరంగా సాగి ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో మంగళవారం ఈ ప్రదర్శనను స్పిక్ మెకే హెరిటేజ్ క్లబ్ సహకారంతో స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్ నిర్వహించింది.గురువుకు నివాళిగా చొల్కెట్టుతో శాస్త్రీయ నృత్య పారాయణం ప్రారంభమైంది. తర్వాత వసుంధర సుందర ధార భూమి ప్రదర్శన గాత్రానికి తగ్గ అభినయంతో అలరించింది. ఆ తరువాత ప్రతిభా రే రచించిన పద వర్ణన’తో కొనసాగి, తిల్లానా’తో ముగిసి, ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ముంచేసింది.మాధవన్ సంపూత్రి సీపీ (గానం), రమేష్, బాబు కేపీ (మృదంగం), అరుణ్ దాస్ సీపీ (ఇడక్క), కోలంక సాయికుమార్ (వయోలిన్) తదితరులు డాక్టర్ వీనా ప్రసాద్ కు సహకారం అందించారు.మోహినియాట్టం పారాయణం వంటి కార్యక్రమాల ద్వారా మనదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయడం గీతం, హైదరాబాద్ కొనసాగిస్తోంది.