అమీన్పూర్
రాష్ట్రంలోని మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 100 శాతం సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువులో ఆరు లక్షల 24 వేల రూపాయల విలువగల మూడు లక్షల 12 వేల చేపపిల్లలను చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారని అన్నారు.
మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, జిల్లా మత్స్యశాఖ అధికారి సతీష్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.