మనవార్తలు ,శేరిలింగంపల్లి :
మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా విద్యాబోధన జరగాలని ప్రముఖ విద్యావేత్త, ఎన్ సి ఈ ఆర్ టి రీసెర్చ్ పర్సన్ డాక్టర్ రామకృష్ణ ఆధురి అన్నారు. బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యాలయ ఉన్నత పాఠశాల లో బుధవారం నాడు ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రామకృష్ణ ఉపాద్యాయులందరికి నూతన విద్యా విధానం గురించి ఎన్నో మెళుకువలను వివరించారు.
అదే విధంగా ఉపాద్యాయులందరూ పరస్పర సహకారంతో విధులను నిర్వహించటం, విద్యార్థులు ఎదుర్కొంటున్న రకరకాల విద్యాపరమైన సమస్యలను అధిగమించడానికి వివిధ రకాల సూచనలను అందించారు. ఇటువంటి శిక్షణా తరగతులను నిర్వహించడం ద్వారా మారుతున్న నూతన విద్యా విధానాలకు అనుగుణంగా తమ ఉపాద్యాయుల బృందం కూడా సన్నద్ధంగా ఉండేలా జ్యోతి విద్యాలయ ఉన్నత పాఠశాల యాజమాన్యం సర్వదా కృషి చేస్తున్నారని తెలిపారు. గుడ్ లర్నింగ్ ఇన్ యాక్షన్ పేరుతో విద్యార్థులకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా బోధించడం ఎలా అనేది కూడా వివరించినట్లు అధ్యాపకుల బృందం తెలిపింది.