గీతమ్ లో నేడు విద్యా నాయకత్వ సమ్మేళనం

Telangana
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లో డిసెంబర్ 13, 2023న (బుధవారం) ‘భారతీయ విద్యా నాయకత్వ సమ్మేళనం’ను నిర్వహించనున్నారు. ఈ ఒకరోజు సమావేశంలో దేశ నలుమూలల నుంచి సీబీఎస్ఈ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు దాదాపు 200 మంది పాల్గొననున్నారు.ఉన్నత విద్యలో లిబరల్ ఆర్ట్స్, స్టెమ్ (సెన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్)ని ఏకీకృతం చేసే చర్చలలో పాల్గొనడానికి, వినూత్న విధానాలను రూపొందించడానికి ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడనుంది. పరస్పరం సహకరించుకోవడానికి, ఆలోచనలను సులభతరం చేయడానికి, మెరుగైన విద్యా పద్ధతుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి గాను దీనిని సంకల్పించారు.ఉన్నత విద్యా రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నూతన ఆవిష్కరణలకు ఉదార విద్య, స్టెమ్ కోర్సులు ఎలా దోహదపడతాయి అనే అంశంపై ప్రముఖులు చర్చించనున్నారు. విద్యా సంస్థల ఉన్నతాధికారు లకు విలువెన అంతరష్టులను అందించడానికి, ఉత్తను అభ్యాసాలను పంచుకోనడానికి, భారతదేశంలో విద్యా భవిష్యత్తును రూపొందించడంలో కొనసాగుతున్న కృషికి తనువంతు సహకారం అందించడానికి ఈ సదస్సు ఉపకరించనున్నది. విద్యా నాణ్యత, ప్రభానాన్ని సింపొందించే సమిష్టి కృషికి ఈ సమావేశం దోహదపడగలదని నిర్వాహకులు ఆశాభావం నెలిబుచ్చారు.ఆసక్తి గల వివిధ సీబీఎస్ఈ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.ఇతర వివరాల కోసం డాక్టర్ కె.శివకుమార్ 9542 42 4256/66ను సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *