తాగి మరియు ఫోను మాట్లాడుతూ వాహనాలు నడపరాదు_ పటాన్ చెరు సిఐ ప్రవీణ్ రెడ్డి

Telangana

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

పటాన్ చెరు  డిసిఎం డ్రైవర్ల సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తాగడం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదని, కచ్చితంగా డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు.బుధవారం పటాన్ చెరు డిసిఎం వర్కర్స్ యూనియన్( సిఐటియు)ఆధ్వర్యంలో జరిగిన పట్టణ డీసీఎం డ్రైవర్ల సమావేశం లో పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతు డ్రైవర్లు మద్యం తాగి మరియు ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయరాదన్నారు. అలా చేయడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని అనేకమంది జీవితాలు కోల్పోతున్నారని, అలాగే అనేక కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయనేది డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని సూచించారు. అలాగే వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలని, అలా పాటించినప్పుడే ప్రమాదాలను నివారించచ్చని ఆయన అన్నారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపరాదని, అలాగే వాహనాల ఇన్సూరెన్స్ ఇతర ఫిట్నెస్ సకాలంలో పూర్తి చేయించుకుంటేనే అందరికీ మంచిదన్నారు.సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య మాట్లాడుతూ ట్రాన్స్ పోర్టు కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వాలు ట్రాన్స్ పోర్టు కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. వెల్ ఫేర్ బోర్డు లేకపోవడం ద్వారా ప్రమాదాలు జరిగిన రవాణా రంగ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబ పోషణ ఇబ్బందు అవుతుందని వాపోయారు. ఈఎస్ఐ,పిఎఫ్, పెన్షన్, ప్రమాద బీమా వంటివి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. దేశ ఉత్పత్తిలో రవాణా రంగం చాలా కీలకమైందని, డీసీఎంలకు స్థలాల సమస్య లేకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వాజిద్ అలీ, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు డీసీఎం డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి జనరల్ సెక్రెటరీ కృష్ణ లు మాట్లాడుతూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, సంఘం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అందరూ ఐక్యంగా ఉండి సమస్యలపై పోరాడి హక్కులు సాధించుకుందామన్నారు. ఈ సందర్భంగా యూనియన్ గుర్తింపు కార్డులను డ్రైవర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆసిఫ్, మరియు డిసిఎం యూనియన్ నాయకులు ఋషి, అతిక్, జనార్దన్ రెడ్డి తదితర డ్రైవర్లు పాల్గొన్నారు.

జెండా ఆవిష్కరణ

అంతకుముందు యూనియన్ జెండాను సిఐటియు సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కార్మిక వర్గానికి ఐక్యతే మహాబలమని, కార్మికులందరూ సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *