Telangana

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దేశంలోని బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు సాధించడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని.. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని.. పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అసమానతలు రూపుమాపి అందరికీ సమ న్యాయం అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. చిన్న రాష్ట్రాల ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని తెలిపారు.. నేటితరం యువత అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో.. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు సిఐ వినాయక్ రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, వెంకటేష్, నర్రా బిక్షపతి, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago