పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
దేశంలోని బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు సాధించడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని.. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని.. పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అసమానతలు రూపుమాపి అందరికీ సమ న్యాయం అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. చిన్న రాష్ట్రాల ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని తెలిపారు.. నేటితరం యువత అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో.. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు సిఐ వినాయక్ రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, వెంకటేష్, నర్రా బిక్షపతి, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…