ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం
మనవార్తలు ,మెదక్
మెదక్ జిల్లా రేగోడ్ మండల పరిధిలోని ప్యారారం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా యువచైతన్య యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.
దీనికిగాను ముఖ్య అతిధి రేగోడ్ మండల ఎస్ ఐ సత్యనారాయణ ఏ ఎస్ ఐ మల్లయ్య గ్రామ సర్పంచ్ పూలమ్మ కిష్టయ్య, ఉప సర్పంచ్ పోచమ్మ అంజయ్య, మరియు ఈ ముగ్గుల పోటీ లో పాల్గొన్న విజేతలకు రేగోడ్ ఎస్సై సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఉమ్మడి మెదక్ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, సంఘసేవకులు తెనుగు నర్సింలు ముదిరాజ్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఉద్యోగ, వ్యాపార రిత్యా వేరే వేరే ప్రాంతాల్లో స్థిర పడిన వారు తాము పుట్టిన ఉరి అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. మహిళలు సoస్కృతి, సాoప్రదాయాలను కాపాడుతూ చక్కటి ముగ్గులు వేశారని కొనియాడారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ తమ పోలీసులు తరుపున కన్సోలేషన్ ప్రైజులు అందజేస్తామని తెలిపారు. తెనుకు నర్సింలు చేస్తున్న సేవలను అభినందిస్తూనే, గ్రామo లో సిసి కెమెరాల ఏర్పాటు కు సహకరించాలని కోరారు.
దాత నర్సింలు ముదిరాజ్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే లక్ష్యం తో మా పాప అనూష పేరుతో సేవాకార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నేటి తరం యువత మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుతుందలని, మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలు నర్సింగ్ రావు పటేల్ ,మోహన్ రెడ్డి పటేల్, విట్టల్ రెడ్డి , యూత్ సభ్యులు సంతోష్ రావు ,వి సంతోష్, వైద్యనాథ్ ,విట్టల్ రావు సంగారెడ్డి ,బి రఘునాథ్ ముదిరాజ్ ,సుభాష్ రావు మచ్చేందర్ ,బేతా గౌడ్, నర్సింగ్ రావు ,నాగేందర్ ,దత్తు రెడ్డి ,శ్రీకాంత్ విట్టల్ , బి. సాయిలు,తాటిపల్లి రాజు ,అరుణ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.మొదటి బహుమతి బి ప్రియాంక ,రెండవ బహుమతి లావణ్య ,మూడో బహుమతి తూర్పు ఇందుమతి బహుమతి గెలుచుకున్నారు.