Hyderabad

వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేత…

వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేత…

పటాన్ చెరు:

పటాన్ చెరు మండల పరిధిలోని ఐనోల్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ సమీపంలోని వృద్ధాశ్రమంలో స్నేహితులతో కలిసి నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా వార్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ…
తన సోదరుడు శివారెడ్డి సలహా మేరకు పప్పు దినుసులు ,బియ్యం, వంటనూనె ,కూరగాయలు ,పండ్లను వృద్ధాశ్రమంలో అందజేశామన్నారు.సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరూ ఆశ్రమాలకు తమకు తోచిన సహాయం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ.. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా ఆశ్రమాలు. వృద్ధాశ్రమానికి తమ వంతు సాయంగా నిత్యావసర సరుకులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని అత్యవసరమైతేనే బయటకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐనోల్ గ్రామ యువకులు శశి ,మహేందర్ ,శ్రావణ్ కళ్యాణ్ ,చింటూ తదితరులు పాల్గొన్నారు.

Venu

Recent Posts

క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం: కాటా శ్రీనివాస్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: క్రీడలు యువతలో క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా…

18 hours ago

భిన్న సంస్కృతులు.. విభిన్న సంప్రదాయాలు.. భక్తి పారవశ్యంలో ఛట్ పూజా వేడుకలు

సబ్బండ వర్గాల సంస్కృతికి ప్రతీక పటాన్‌చెరు అన్ని వర్గాల ప్రజలను గౌరవించడం తెలంగాణ ప్రజల గొప్ప సంస్కారం పటాన్‌చెరు నియోజకవర్గంలో…

19 hours ago

పటాన్‌చెరు ఛట్ పూజలో పాల్గొని ఉత్తర భారతీయులకు శుభాకాంక్షలు తెలిపిన నీలం

-పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక  -అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి  -ఇందిరాగాంధీ…

24 hours ago

రాయసముద్రం చెరువు వద్ద వైభవంగా ఛట్ పూజ వేడుకలు

-ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పటాన్‌చెరు బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి -అన్ని వర్గాల సంస్కృతి, సంప్రదాయాలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా…

1 day ago

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో మెదక్ జిల్లా జట్టుకు ఘన విజయం

సమష్టి కృషితో సత్తాచాటిన క్రీడాకారులు జట్టు సభ్యులను అభినందించిన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ యాజమాన్యం పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: కరీంనగర్‌లో…

1 day ago

శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని తక్షణమే పునర్నిర్మించాలి: కంజర్ల కృష్ణమూర్తి చారి

-విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ నర్సాపూర్‌లో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మల భారీ ర్యాలీ -దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ -ఆలయ పున ప్రతిష్ఠకు…

1 day ago