పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:
క్రీడలు యువతలో క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూర్ గ్రామంలోని స్నేహ ఫంక్షన్ హాల్‌లో ‘పవర్ డ్రాగన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇండియా’ ఆధ్వర్యంలో, సంగారెడ్డి చైర్మన్ గోపాల్ యాదవ్ సారథ్యంలో నిర్వహించిన ‘రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాటా శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో చిన్నారులు సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా మైదానంలోకి వచ్చి ఆడుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా, చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టుగా కలిసి పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 700 మంది విద్యార్థులు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవడం అభినందనీయమన్నారు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ సాధన వల్ల శరీరంలో కండరాలు బలపడటమే కాకుండా, స్టామినా, శారీరక సమతుల్యత మెరుగుపడతాయని తెలిపారు.
ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఆడపిల్లలు తమను తాము రక్షించుకునే ధైర్యం, మెలుకువలు అలవడతాయని చెప్పారు. గురువులను గౌరవించడం, నియమాలను పాటించడం నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో చదువు పట్ల ఏకాగ్రత కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు యాదవ్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు శంకర్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ రజనీకాంత్, దర్గా శ్రీనివాస్, నారాపురెడ్డి,నర్సింగ్ రావు, శ్రీకాంత్ రెడ్డి, యాదయ్య, యాదగిరి,తదితరులు పాల్గొన్నారు
సబ్బండ వర్గాల సంస్కృతికి ప్రతీక పటాన్‌చెరు అన్ని వర్గాల ప్రజలను గౌరవించడం తెలంగాణ ప్రజల గొప్ప సంస్కారం పటాన్‌చెరు నియోజకవర్గంలో…
-పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక -అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి -ఇందిరాగాంధీ…
-ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పటాన్‌చెరు బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి -అన్ని వర్గాల సంస్కృతి, సంప్రదాయాలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా…
సమష్టి కృషితో సత్తాచాటిన క్రీడాకారులు జట్టు సభ్యులను అభినందించిన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ యాజమాన్యం పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: కరీంనగర్‌లో…
-విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ నర్సాపూర్‌లో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మల భారీ ర్యాలీ -దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ -ఆలయ పున ప్రతిష్ఠకు…
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటీమణులు రితు చౌదరి, వర్ష, రుక్సార్ పటేల్ నవంబర్ 15 నుంచి 17 వరకు నోవోటెల్…