శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
త్రివేణి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీరేంద్ర చౌదరి మరియు వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థి ప్రతినిధులు గవర్నర్ డాక్టర్ తమిళి సై ని కలిసి ‘జై జవాన్ జై కిసాన్’అంటూ సైనికులకు రైతులకు మద్దతుగా నిలవడం కోసం విద్యార్థుల తరఫున మరియు విద్యాసంస్థల తరఫున సేకరించిన విరాళాన్ని చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై విద్యార్థులు మరియు యాజమాన్యానికి అభినందనలు తెలిపి విద్యార్థులకు మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా త్రివేణి విద్యా సంస్థలు యాజమాన్యం మరియు విద్యార్థులు వరుసగా మూడోసారి సైనికులకు రైతులకు మద్దతుగా విరాళం అందజేసినందుకు డైరెక్టర్ డాక్టర్ జి వీరేంద్ర చౌదరి ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ జి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండే సైనికులను, భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆహారాన్ని ఇతర పంటలను పండించి నిరంతరం కష్టం చేసే రైతన్నలకు మద్దతు తెలియజేస్తూ త్రివేణి విద్యాసంస్థల యాజమాన్యం మరియు విద్యార్థులు వారి సహాయార్థం ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రివేణి విద్యాసంస్థల ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…