మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
వైద్యం చేసి ప్రాణాలు నిలపాల్సిన వైద్యులే సాక్షాత్తు రక్తదానం లో పాల్గొని అందరికి ఆదర్శనంగా నిలిచారు. కొండాపూర్‌లోని జిల్లా ఆసుపత్రి లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అనురాగిణి రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ చంద్రకృష్ణ, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి ప్రవీణ్ ల సమక్షంలో వైద్యషిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. రోగుల ప్రయోజనం కోసం అనేక మంది వైద్యులు మరియు సిబ్బంది రక్తదానం చేశారు.వైద్యసేవలు చేయాల్సిన వైద్యులే రక్తదానం చేయడం గొప్పవిషయం అని మెడికల్ సూపరిండెంట్ అనురాగిణి రెడ్డి అన్నారు.