Districts

వేణు కేసిరెడ్డికి డాక్టరేట్

మనవార్తలు ,పటాన్ చెరు:

భారతదేశంలో జాతీయ బ్యాంకుల నిర్వహణ పనితీరు – బ్యాంక్ ఆఫ్ బరోడా , ఓ సందర్భ పరిశీలన పై అధ్యయనం చేసి , సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి కేసిరెడ్డి వేణును డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ – హైదరాబాద్ ప్రొఫెసర్ ఏ . శ్రీరామ్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను పెంచడాన్ని చాలా మంది బ్యాంకు ఉద్యోగులు గణనీయంగా ప్రభావితం చేశారని , ప్రతి ఉద్యోగికీ వ్యాపారం పెరగడం అధిక సామర్థ్యాన్ని సూచిస్తోందని , బ్యాంకు వడ్డీ రేటు కంటే ఒక్కో షేరుకు వచ్చే సంపాదన మెరుగ్గా ఉందని , బ్యాంక్ ఆఫ్ బరోడా అడ్వాన్సులపై మంచి రాబడిని పొందుతోందని ఈ అధ్యయనంలో వెల్లడయినట్టు వివరించారు .

వేణు సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , గీతం బిజినెస్ స్కూల్ – హెదరాబాద్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

12 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

13 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago