మనవార్తలు ,పటాన్ చెరు:
భారతీయ జీవిత భీమా పరిశ్రమలో లాభదాయకతను పెంపొందించే ఒక అధ్యయనం ‘ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి రమేష్ కుమార్ సాతులూరిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ – హైదరాబాద్ ప్రొఫెసర్ ఆర్.రాధిక సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .
భారతదేశంలో జీవిత భీమా సంస్థల లాభదాయకతపై ధృవీకరించే సాక్ష్యాలను అందించడం ఈ పరిశోధన ప్రధాన లక్ష్యంగా ఆమె తెలిపారు . డిపెండెంట్ వేరియబుల్ , మొత్తం వ్యయం , కొత్త వ్యాపార ప్రీమియం , పునరుద్ధరణ ప్రీమియం , ఇండిపెండెంట్ వేరియబుల్స్ గా చెల్లించే ప్రయోజనాల మధ్య లాభదాయకత మధ్య సహసంబంధాన్ని ఏర్పరచడానికి ఈ థీసిస్ ప్రయత్నించినట్టు ఆమె పేర్కొన్నారు .
విశ్లేషణ ప్రకారం , నిబంధనలు , నిలకడ లాభదాయకతపై సానుకూల ప్రభావాన్ని చూపినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు . రమేష్ కుమార్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , గీతం బిజినెస్ స్కూల్ – హైదరాబాద్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…