Districts

గీతం స్కాలర్ వరప్రసాద్కు డాక్టరేట్…..

పటాన్ చెరు:

‘ కాగ్నిటివ్ రేడియో నెట్వర్క్లో ప్రాథమిక వినియోగదారుడిని గుర్తించడం కోసం అత్యాధునిక మెషిన్ లెర్నింగ్ పద్ధతులను వినియోగించడం ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశోధక విద్యార్థి కె.వెంకట వరప్రసాద్ ను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈఈసీఈ ప్రొఫెసర్ టి.త్రినాథరావు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .

కాగ్నిటివ్ రేడియో అభివృద్ధి చెందుతున్న , ఆకర్షణీయమైన సాంకేతికతని , ఇది స్పెక్ట్రమ్ కొరత సమస్యకు పరిష్కారాన్ని చూపుతుందని ఆయన తెలిపారు . ఈ నెట్వర్క్ లెసైన్స్ పొందనివారు ప్రాథమిక వినియోగదారునికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా స్పెక్ట్రమ్ను వినియోగించుకుంటారన్నారు . ఈ నెట్వర్క్ ప్రాథమిక వినియోగదారుడి గుర్తింపే ప్రధాన సమస్య అని , వారిని గుర్తించడం కోసం అదనపు శక్తిని వినియోగించే విధానాన్ని సిద్ధాంతంలో ప్రతిపాదించినట్టు తెలిపారు .

ఈ పనిని రియల్ టెమ్ వెరైస్ సెన్సార్ నెట్వర్క్ ఫీల్డ్లలో అన్వయించవచ్చన్నారు . ఈ పరిశోధన రేడియో స్పెక్ట్రమ్ కొరతను అధిగమించడానికి , ఉపగ్రహ సమాచార ప్రసారాలు , సేవల నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు . వరప్రసాద్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఇంజనీరింగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ , పలువురు విభాగాధిపతులు , అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో వివరించారు .

Ramesh

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago