కరోనా గురించి అధైర్య పడకండి…
– సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి
– ప్రతి ఒక్కరు మాస్కులు. భౌతిక దూరం పాటించాలి
మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి
పటాన్ చెరు:
కరోనా వస్తే ఏం చేయాలి ,ఏం చేస్తున్నాం కరోనా విజృంభిస్తున్న కొద్దీ .. మనలో అందోళనతో పాటు అనుమానాలు , అపోహలు పెరిగిపోతున్నాయి . ఏం చేయాలి , ఎలా చేయాలి అన్న దానిపై ఒక్కోచోట ఒక్కోలా వినిపిస్తుండేసరికి ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం దీనికంతటికీ ఒకటే మందు ధైర్య మని మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి అన్నారు.
ఏద కంగారు పడకుండా కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే కరోనా రాకుండా సరైన డెసిషన్ తీసుకోవాలన్నారు . ముఖ్యంగా ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాధి సోకకుండా ఉండవచ్చని ప్రతిరోజు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి చాలామంది అధైర్య పడుతున్నారన్నారు. మన దృష్టిని సోషల్ మీడియా. టీవీలో వచ్చే వార్తలపై పెట్టవద్దని సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నిజానిజాలను గమనించాలన్నారు. ప్రతిరోజు శరీరానికి వ్యాయామం అవసరమని. మనము తీసుకునే ఆహార పదార్థాల్లో లభించే పోషక పదార్ధాలు కల ఆహారాన్ని తీసుకోవాలని నాకు ఏమైతది అనే భావనతో ఉండకూడదన్నారు. బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలి ఒకరికి ఒకరికి మధ్య భౌతిక దూరం పాటించడంతో కరోనా ను కట్టడి చేయొచ్చని ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.