12 ఏళ్లగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
సమాజ సేవ, సుస్థిర అభివృద్ధి పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం రుద్రారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్లాస్ మేట్ నోట్ బుక్ లు, క్రేయాన్లు, పెన్నులు, పెన్సిళ్లు, స్టేషనరీ కిట్లతో పాటు భోజనం ప్లేట్లను పంపిణీ చేసింది.చుట్టుపక్కల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యా అవసరాలకు మద్దతుగా, గత 12 సంవత్సరాలుగా గీతం నిరంతరం నిర్వహిస్తున్న సుదీర్ఘకాల అవుట్-రీచ్ కార్యక్రమంలో ఇది ఒక భాగం.ఈ పంపిణీ కార్యక్రమం, ‘వ్యర్థాల నుంచి సంపద’ (Wealth out of Waste – WoW) అనే నినాదంతో గీతం చేపడుతున్న సుస్థిరతా ప్రయత్నం. ఈ కార్యక్రమం ద్వారా, గీతం విద్యార్థులు ఆతిథ్య విభాగం సహకారంతో ప్రాంగణం నుంచి చదివేసిన వార్తాపత్రికలు, పాత రికార్డులు, పుస్తకాలు, ఇతర పునర్వినియోగ కాగితపు సామగ్రిని సేకరిస్తారు.
ఈ సామగ్రిని రీసైక్లింగ్ కోసం ఐటీసీ పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ విభాగానికి అప్పగిస్తారు. ప్రతిఫలంగా, ఐటీసీ క్లాస్ మేట్ విద్యా ఉత్పత్తులను అందిస్తుంది. వీటిని పేద విద్యార్థులకు పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత రెండింటినీ గీతం ప్రోత్సహిస్తోంది.ఈ విద్యా కిట్లను గీతం హైదరాబాద్ రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్, గీతం పూర్వ విద్యార్థి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనూజ్ తదితరులు పంపిణీ చేయగా, ఇ-క్లబ్ చైర్మన్ మాధవ్ భాస్కర్, ఇ-క్లబ్ సభ్యులు సహకరించారు.విద్యార్థులు నోట్ బుక్ లు, స్టేషనరీ కిట్లను ఎంతో ఉత్సాహంగా స్వీకరించి, చిరునవ్వులతో, హృదయపూర్వక కృతజ్జతతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు గీతం, ఐటీసీ అందిస్తున్న నిరంతర మద్దతు, సహకారానికి కృతజ్జతలు తెలియజేశారు.ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంపై శాశ్వత సానుకూల ప్రభావాన్ని సృష్టించే కార్యక్రమాల ద్వారా నాణ్యమైన విద్య, పర్యావరణ సుస్థిరత, అర్థవంతమైన సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి గీతం కట్టుబడి ఉందని చెప్పారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…