జాతి నిర్మాణంలో రాక్ ఇంజనీరింగ్ పాత్ర గీతన్తో చర్చాగోష్టి

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

‘జాతి నిర్మాణంలో రాక్ ఇంజనీరింగ్ పాత్ర’ అనే అంశంపై ఈనెల 18న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్లో చర్చాగోష్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మనిర్బర్ భారత్ అభియాన్లో భాగంగా, భారత గనుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎఎం) సౌజన్యంతో దీనిని నిర్వహిస్తున్నట్టు ప్రొఫెసర్ టి.మాధవి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.హెబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మనదేశంలోని ఇరవెకి పైగా సంస్థల నుంచి విద్యార్థులు,అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆమె తెలిపారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హెదరాబాద్ డెరైక్టర్:ప్రొఫెసర్ ఏ.ఆర్.శాస్త్రితో పాటు ఎన్ఎస్ఐఆర్ఎఎం డెరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్.వెంకటేష్, పలువురు శాస్త్రవేత్తలు ప్రధానవక్తలుగా పాల్గొంటారన్నారు. వృత్తిజీవితంలో ఎదురయ్యే సవాళ్ళను గురించి అవగాహన కల్పించడంతో పాటు రాక్ ఇంజనీరింగ్కు సంబంధించిన పరిశోధనలు సిద్ధాంతిక ఆవరణాత్మక అంశాలపై నిపుణులు ఉపన్యసిస్తారన్నారు.?

సారంగాలు, భూగర్భ గుహలు, తవ్వకాల ప్రాజెక్టులు, అణు విద్యుత్ ప్రాజెక్టులు, జల విద్యుత్ ప్రాజెక్టులు మొదలైన వాటిలో అవలంబిస్తున్న కొత్త సాంకేతికతలకు సంబంధించిన కేస్ స్టడీలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నట్టు డాక్టర్ మాధవి తెలిపారు. పెద్ద తవ్వకాల అనంతర ప్రభావాలను పర్యవేక్షించడంలో ఆధునిక పరికరాల పాత్రను కూడా వివరిస్తారన్నారు.సివిల్, మెనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, అనుబంధ ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థులకు ఈ చర్చాగోష్టి,ఉపకరిస్తుందని ఆమె తెలిపారు.ఇతర వివరాల కోసం డాక్టర్ అరిజిత్ సాహా (7005640 623)ని సంప్రదించాలని లేదా asaha@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని డాక్టర్ మాధని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *