పటాన్ చెరు
పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తన వంతు సాయంగా ఆర్థిక సాయం అందచేసేందుకు యండిఆర్ ఫౌండేషన్ ముందుటుందని ఫౌండేషన్ ఛైర్మన్ ,పటాన్ చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు అన్నారు.సామాజిక సేవా కార్యక్రమాలతో భాగంగా పేద ప్రజలకు అండగా ఎండీఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణం కోసంపదిహేను వేల ఆర్థిక సహాయం అందజేశారు.
పటాన్ చెరు పట్టణంలోని చైతన్యనగర్ లో ఉంటున్న ఓ కుటుంబ ఇంటి నిర్మాణం కోసం పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు,యండిఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. . తన నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో సామాజిక మార్పుకోసం, సమాజసేవ చేయటం కోసం ప్రజల్లో ఉన్నట్లు దేవేందర్ రాజు తెలిపారు. ఎంతో మందికి ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణాలకు నగదు, పెళ్లిళ్లకు, చదువులకు, వక్తిగత అవసరాలకు ఆర్థిక సాయం అందించామన్నారు. తాను చేసిన సేవలు ఎంతో సంతృప్తినిచ్చిందని, యండిఆర్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు.