ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

politics Telangana

_సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సుసాధ్యం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడే వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవచ్చని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిహెచ్ఎంసి పరిధిలోని మూడు డివిజన్లలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ గా మెట్టు కుమార్ యాదవ్ ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం రాత్రి జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసిన అభినందన సభకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల కాలంలో డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను బ్రోచర్ రూపంలో విడుదల చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిఎంఆర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్లలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతోపాటు వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.

ఒకనాడు కాలుష్యానికి చిరునామాగా పేరొందిన పటాన్చెరు నేడు అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల సహాయ సహకారాలతో వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే అభివృద్ధి సుసాధ్యం అవుతుందని అన్నారు.ప్రజలు అందిస్తున్న ప్రోత్సాహంతో రాబోయే మూడు సంవత్సరాలలో మూడు డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. డివిజన్ల అభివృద్ధికి అనునిత్యం అహర్నిశలు కృషి చేస్తున్న కార్పోరేటర్లను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *