పట్టణ ప్రగతి పనులతో అభివృద్ధి

Hyderabad Telangana

రామచంద్రపురం

5వ రోజు పట్టణ ప్రగతి పనులలో భాగంగా రామచంద్రపురం డివిజన్లో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పర్యటించారు డిబ్రిస్ ను జిహెచ్ఎంసి సిబ్బందితో,జేసీబీ,టిప్పర్లలతో దగ్గర ఉండి తొలగించడం జరిగింది.అలాగే బస్తిలో ఉన్న పిచ్చి మొక్కలను కూడా తొలగించడం జరిగింది. కిరాణా షాప్ యజమానికి దోమల నివారణలుకు ఎలాగా జాగ్రత్తలు తీసుకోవాలో ఏంటమలజీ డిపార్ట్మెంట్ ద్వారా కరపత్రం ఇచ్చి వాటి గురించి అవగాహనా కల్పించారు అలాగే నీరు నిలిచినా,ఓపెన్ డ్రైన్ లో దోమలు ఎదగకుండా స్ప్రే చేసి కెమికల్ వేసిన కార్పొరేటర్.అనంతరం బస్తిలలో పర్యటించి స్థానికులతో వారికీ ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నరు. అనంతరం కార్పొరేటర్ పుష్పనగేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి ఇంటికి మొక్కలు నాటాలని కోరారు ప్రభుత్వం పల్లె పట్టణ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని అన్నారు. పచ్చదనం పరిశుభ్రతే పట్టణ ప్రగతి లక్ష్యంగా రూపొందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సీఎం మల్లేష్,బుల్లా అశోక్,సజ్జయాదయ్య,నాగరాజు,నర్సింహా,శంకర్,కుమార్,రాగం యాదయ్య,సూపర్వైసోర్ ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *