Telangana

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన

తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత 

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు 

పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి 

క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి 

త్వరలో నూతన సబ్ స్టేషన్లు, నందిగామ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం 

ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయండి 

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

నియోజకవర్గస్థాయి ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన తాగునీరు సరఫరా, నిరంతర విద్యుత్ పంపిణీ, పారిశుధ్యం, తదితర అంశాల్లో అలసత్వం వహించవద్దని.. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని ఆయా శాఖల ఉన్నత అధికారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు.బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో అమీన్పూర్, పటాన్చెరు బల్దియా డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు, విద్యుత్, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలల శాఖల అధికారులతో వివిధ అంశాలపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందించాలన్న లక్ష్యంతో అమీన్పూర్, పటాన్ చెరు సర్కిళ్ల పరిధిలో 345 కోట్ల రూపాయలతో క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కిష్టారెడ్డిపేట, అమీన్పూర్, తెల్లాపూర్ పరిధిలో నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రాథమిక విద్య నుండి ఇంటర్మీడియట్ వరకు తరగతులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆధునిక వసతులు అత్యాధునిక సౌకర్యాలతో వీటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా లో ఓల్టేజ్ సమస్యలు తలెత్తకుండా పవర్ ట్రాన్స్ఫార్మర్లు, నూతన సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో పోచారం, లకడారం సబ్ స్టేషన్లు ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. నూతన కాలనీలలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.శిథిలావస్థకు చేరుకున్న స్తంభాల స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని  అవసరమైతే సొంత నిధులతో స్తంభాలు కొనుగోలు చేసి ఇస్తానని అధికారులకు తెలిపారు.

అమీన్పూర్, పటాన్ చెరు సర్కిళ్ల పరిధిలోని ప్రతి వార్డులో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. టెండర్లు పూర్తయి శంకుస్థాపన చేసిన పనుల పురోగతిని తెలుసుకున్నారు.ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, గుమ్మడిదల, జిన్నారం మున్సిపాలిటీల పరిధిలో 75 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. 50 శాతం పనులు పూర్తయ్యాయని  మిగిలిన పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు కమిషనర్లు తెలిపారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు  అవసరమైతే బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. పన్ను సవరణ అంశంలో ప్రజలకు భారం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినప్పుడే ప్రజల నమ్మకాన్ని పొందుతామని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని.. అభివృద్ధిలో కలిసి పనిచేయాలని కోరారు.పటాన్చెరు, గుమ్మడిదల మండలాల పరిధిలోని గ్రామాలలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. పటాన్చెరువు మండల పరిధిలోని నందిగామ గ్రామంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతి నెలకు ఒకసారి అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలపై సమావేశాలు నిర్వహిస్తూ  సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించకూడదని   నిధుల కొరత ఉంటే తనను నేరుగా సంప్రదించాలని కోరారు. పటాన్ చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

1 hour ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

2 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

7 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

20 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

20 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

20 hours ago