-బీసీ-ఏ కోసం కదం తొక్కిన ముదిరాజులు*
-జిన్నారం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ*
-ఆర్‌ఐ శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించిన ముదిరాజ్ నాయకులు
జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి :
ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ పటాన్‌చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండల ముదిరాజులు కదం తొక్కారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ సంఘాల నాయకులు, ప్రతినిధులు భారీగా తరలివచ్చి జిన్నారంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ముదిరాజ్ నాయకులు జిన్నారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముదిరాజుల ప్రధాన డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కోరారు.ముదిరాజ్ నాయకులు సమర్పించిన వినతిపత్రంపై ఆర్‌ఐ శ్రీనివాస్ స్పందిస్తూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ముదిరాజుల డిమాండ్‌పై సంబంధిత అధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ-ఏ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గుండ్లపల్లి శ్రీనివాస్, బాలు గారి నర్సింలు, ముదిరాజ్ సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అడ్వైజర్ రవి, మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గంగు రమేష్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ పోరాట సమితి మండల అధ్యక్షుడు సుంకరబోయిన మహేష్, నరసింగరావు, మల్లేష్, వీర్నాల సత్యనారాయణ, మాణిక్యం, బాల్రాజ్, వెంకటేష్‌తో పాటు వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…