కనులపండువగా సాగిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ విగ్రహప్రతిష్ఠాపన
పటాన్ చెరు:
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభవృద్దికి పెద్ద పీట వేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు .ముఖ్యంగా తెలంగాణలో వెయ్యికోట్ల రూపాయల వ్యయంతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు చైతన్య నగర్ కాలనీలో సొంత నిధులతో జీర్ణోద్దరణ గావించిన ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని …మానవసేవే మాధవ సేవ అనే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు . ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .
కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయి ప్రజలంతా శుఖ శాంతులతో వర్థిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అన్నారు . అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాప కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మెట్టుకుమార్ యాదవ్,టీఆర్ఎస్ సీనియర్ నేత విజయ్ కుమార్ వెంకటేష్ , ఆలయ కమిటీ సభ్యులు ,కాలనీ వాసులు పాల్గొన్నారు.