గీతమ్ లో దాండియా జోష్

Telangana

_ఘనంగా దసరా సంబరాలు 

_సృజనాత్మకతను చాటిన విద్యార్థులు

నవరాత్రుల పవిత్రమైన రోజులను జరుపుకోవడానికి మంత్రముగ్ధులను చేసే దాండియా జోష్ కార్యక్రమాన్నిశనివారం హదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలలోభాగంగా జరిగిన ఈ ఉత్సాహభరితమైన వేడుక నిజమైన స్ఫూర్తిని ప్రదర్శించడమే గాక అన్నివర్గాల విద్యార్థులను ఒకచోట చేర్చింది. ప్రాంగణమంతా ఉత్సాహభరితమైన వాతావరణంతో నిండిపోవడంతో పాటు విద్యార్థులతో కోలాహలం కనిపించింది.దుర్గాదేవి పూజతో ప్రారంభమైన దాండియా వృత్య ప్రదర్శన ఉత్తేజకరంగా సాగింది. రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన విద్యార్థులు ఐక్యంగా వేడుకలను నిర్వహిస్తూ, ఉత్సాహంగా, ఆనందంతో కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు.ఈ కార్యక్రమం కేవలం నవరాత్రి వేడుక మాత్రమే కాదని, విద్యార్థులు తను ఆందోళనలను మరచిపోవడానికి కూడా దోహదపడుతుందని స్టూడెంట్ రెస్ట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు. పాపాలను లేదా చెడు లక్షణాలను వదిలించుకోవడంలో దసరా ప్రాముఖ్యతను అర్ధం చేసుకుంటూ విద్యార్థులు : ఆనందాన్ని అనుభవించే వాతావరణాన్ని సృష్టించాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు.విద్యార్థులు తనలో విలిడీకృతంగా ఉన్న నృత్య మెళకువలను ప్రదర్శించి, పండుగ వేళ ఉత్సాహంతో ఉల్లాసంగా గడిపి అందమైన జ్ఞాపకాలతో చిరునవ్వులు చిందిస్తూ ఇంటి ముఖం పట్టారు.విద్యార్థులకు సంపూర్ణ విద్యను అందించడానికి, వారి ప్రతిభ, అభిరుచులను పెంపొందించడానికి గీతం కట్టుబడి ఉందని ఈ వేడుకల నిర్వహణ ద్వారా చాటింది. దాండియా వంటి సృజనాత్మక వేడుకల నిర్వహణ ద్వారా! సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులలో తనుకంటూ ఒక భావాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *