-డ్రగ్స్ అమ్మేవారు, కొనే వారిపైన కఠిన చర్యలు
– డ్రగ్సును అరికట్టే బాధ్యత అందరిదీ
మంజీరా విజ్ఞాన కేంద్రం ఫౌండర్ కే రాజయ్య, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఎందరి జీవితాలను చిన్న భిన్నం చేస్తున్న అరికట్టి డ్రగ్స్ రహిత సమాజంను నిర్మిద్దామని పటాన్ చెరు డిఎస్పీ రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పటాన్ చెరు పట్టణంలోని డాక్టర్ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎం వి కే( మంజీరా విద్యాలకేంద్రం) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన డ్రగ్స్ వ్యతిరేక సదస్సు లో పటాన్ చెరు డిఎస్పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎవ్వరు కూడా డ్రగ్స్ కు అలవాటు పడకూడదని, అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోకూడదని, సంఘవిద్రోహ శక్తులుగా మారకూడదని హితువు పలికారు, డ్రగ్స్ సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందజేయాలని ఆయన కోరారు. డ్రగ్స్ కొన్న అమ్మిన చట్ట రిత్యా నేరమని ఉక్కు పాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. మీ భావి భారత జీవితాలను నాశనం చేసుకోకూడదని విజ్ఞప్తి చేశారు, ఒక్కసారి డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం నాశనమైదాకా వదలదని అన్నారు, మీ జీవితాలు, తల్లిదండ్రుల జీవితాలు అందరి జీవితాలు చిన్న భిన్నం అవుతాయనేది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం కూడా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాటానికి ఎంతో కృషి చేస్తున్నట్లు, అందులో మీరు మీతో పాటు ప్రతి ఒక్కరూ డ్రగ్స్ రహిత సమాజం కోసం భాగస్వాములు అయి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ సదస్సులో ఏం వి కే ఫౌండర్ సభ్యులు కే రాజయ్య, కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎం వి కే కన్వీనర్ అర్జున్ తదితరులు మాట్లాడుతూ డ్రగ్స్ ను అరికట్టాల్సిన బాధ్యత అందరి పైన ఉందని వారు అన్నారు, ఫ్రెండ్ షిప్ చాలా ముఖ్యమైందని, మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నమో చాలా జాగ్రత్తగా చేయాలన్నారు, చెడువారితో అసలు స్నేహం చేయకూడదని, డ్రగ్సును అరకట్టే బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వం, పోలీసులు, సామాజిక సంస్థల పైన ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై అంబార్య నాయక్, ఏం వి కే సభ్యులు బాసిత్, సుదర్శన్ రెడ్డి, ఇమ్మానియేల్ బాబు సురేష్, కాలేజీ లెక్చలర్లు ,ర్యాగింగ్ వ్యతిరేక కన్వీనర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.