గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ …
-అర్జిత సేవలు నిలిపివేత
పటాన్‌చెరు:
పటాన్ చెరు మండల పరిధిలోని గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ రావడంతో సోమవారం నుండి అర్జిత సేవలు నిలిపివేసినట్లు సమాచారం.ఈ విషయం పై ఆలయ ఈఓ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు . అయితే ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన అర్చకులు భయంలో పడ్డారు . ఎక్కడ వారు కూడ కరోనా బారిన పడతామో అని విధులకు వచ్చేందుకు ఆలోచిస్తున్నారు . అయితే ప్రసిద్ది చెందిన ఆలయాలలో కరోనా పాజిటివ్ వస్తే 10 రోజులు ఆలయంను మూసివేసిన విషయం తెలసిందే . కాని గణేష్ గడ్డ దేవస్థానంలో అర్జిత సేవలు నిలిపివేసి స్వామివారిని భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు .