సమన్వయంతో ఆవిష్కరణలు- అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యక్షుడు శ్రీభరత్

Hyderabad Telangana

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యక్షుడు శ్రీభరత్

 

పటాన్ చెరు:

రసాయన, జీవ, పర్యావరణ శాస్త్రాల మధ్య సమన్వయం, పరిశోధకుల మధ్య భాగస్వామ్య అధ్యయనాల ద్వారా నూతన ఆవిష్కరణలు సాధ్యపడతాయని గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో రసాయన, జీవ, పర్యావరణ శాస్త్రాల అభివృద్ధి అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు (వెబినార్) సోమవారం ఆరంభమైంది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానానికి పరిధులు లేవని, అంతర్ విభాగ పరిశోధనలతో కొత్త అంశాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ స్కూల్ పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, విశాఖలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.శరత్ చంద్రబాబు, సదస్సు కన్వీనర్లు డాక్టర్ ఎ.రత్నమాల, డాక్టర్ వందన తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

పట్టణ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పాదన:సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా పట్టణ వ్యర్థాలను విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగించుకోవచ్చునని అమెరికాలో యంగ్ టౌన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధన బృందం నిపుణుడు ప్రొఫెసర్ క్లోవిస్ లిన్ కాన్ తెలిపారు. పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే విషపూరిత వ్యర్థాలను సయితం ఎలక్ట్రో కెమిస్ట్రీ పరిజ్ఞానం ఆధారంగా విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగించుకునే విధానాన్ని ఆయన వివరించారు. మలేసియా విశ్వవిద్యాలయం పరిశోధకుడు డాక్టర్ గాబ్రియేల్ ఔషధ పరిశోధనలకు వినియోగిస్తున్న నూతన ఏటీఆర్ – ఎస్ఎఆర్ స్పెక్ట్రోస్కోప్ గురించి వివరించారు. ప్రొఫెసర్ ఎం.రామారావు, ప్రొఫెసర్ ఆర్.వెంకటనాలు సదస్సు చైర్మన్లుగా వ్యవహరించారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన దాదాపు 250 మంది శాస్త్ర నిపుణులు పాల్గొంటున్నారు. మరో రెండు రోజులపాటు ఈ సదస్సు కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *