సనాతన ధర్మ పరిరక్షకుడు హిందు సామ్రాట్ సర్వ మానవాళికి దిక్సూచి ఛత్రపతి శివాజీ _ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని సందర్భంగా పటాన్ చేరు నియోజవర్గం పాశమైలారం గ్రామ పరిధిలోని ఛత్రపతి శివాజీ యువసేన వారి అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన పటాన్ చేరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ శివాజీ అజేయ స్ఫూర్తిని, దార్శనిక నాయకత్వాన్ని, భారత చరిత్రకు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారుఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అజేయమైన స్ఫూర్తి, ధైర్యం మరియు తన ప్రజల పట్ల నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు.శివాజీ మహారాజ్ గారి ప్రతిభ యుద్ధంలోనే కాదు, పరిపాలనలోనూ ఉందని,ఆయన సమర్థవంతమైన పాలనను స్థాపించాడు, ఆదాయ సేకరణలో సంస్కరణలను అమలు చేశాడు, మరియు క్రమశిక్షణ కలిగిన సైనిక నిర్మాణాన్ని నిర్వహించాడని తెలిపారు. గొప్ప పరిపాలకుడిగా , ఉదార పౌర పాలన స్థాపకుడిగా కీర్తిని పొందారని చెప్పారు . ఆయన గాథలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు .ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి,వీరేష్ గౌడ్,సంతోష్,బుమేష్,వినోద్,వేణుగోపాల్,మరియు శివాజీ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *